UPDATED 24th AUGUST 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మీ
వ్రతాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఓరుగంటి నరసింహయోగి, తదితర వేదపండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణల నడుమ వ్రతపూజల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ ఇంటిల్లిపాదికి లక్ష్మీకటాక్షం కలగాలని వేడుకున్నారు. అనంతరం గణేష్ యూత్ ఆధ్వర్యంలో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించారు.







