వనం-మనం కార్యక్రమం విజయవంతం చేయాలి

UPDATED 11th JULY 2018 WEDNESDAY 5:00 PM

పెద్దాపురం: పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో వనం-మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్.ఎస్.వి.బి. వసంతరాయుడు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో   వనం-మనం కార్యక్రమంపై నియోజకవర్గ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన వనం-మనం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మున్సిపల్  కమీషనర్లు, ఎంపిడివోలు, తహసీల్దార్లు, అంగన్వాడీ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, రోడ్డుకు ఇరువైపులా, కెనాల్ రోడ్డు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహ పరిసరాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలంటే వృక్ష సంరక్షణ ఎంతో ముఖ్యమని, మొక్కలు నాటడమే కాక వాటి పరిరక్షణ కూడ మన బాధ్యత అన్నారు. గానుగ, రావి, తదితర మొక్కలు నాటాలని, మొక్కల చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ కమీషనర్లు బి.ఆర్. శేషాద్రి, సి.హెచ్. వెంకటేశ్వరరావు, ఎంపిడివో పి. వసంతమాధవి, సామర్లకోట ఎంపిడివో కార్యాలయం సూపరింటెండెంట్ బి. శ్రీనివాస్, తహసీల్దార్లు గంగుమళ్ళ బాలసుబ్రహ్మణ్యం, ఎల్. శివకుమార్, సిడిపివోలు టి.డి.ఆర్. పద్మావతి, ఆదుర్తి విజయలక్ష్మి, ఏపిఎంలు ఎస్. వేదకుమారి, సి.హెచ్. జగదీశ్వరి, ఏపివో మేనేజర్ ఆర్. ప్రభాకరరావు, ఆర్ అండ్ బి.ఎఇ వి. వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us