UPDATED 19th MARCH 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: దళితుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలోని స్థానిక సంగీతరావుపేట, బలుసులపేట తదితర ప్రాంతాలలో దళితతేజం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమార స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు,13వ వార్డ్ కౌన్సిలర్ వేల్పుల జయలక్ష్మి,14వ వార్డ్ కౌన్సిలర్ రావి కస్తూరి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వసంత నవరాత్రులను పురస్కరించుకుని స్థానిక ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయంలో కంచి మహా సంస్థానం అధ్యక్షుడు చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్ర శత చండీ సహిత మహాసౌరయాగ హోమం, పూజలలో మంత్రి చినరాజప్ప పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.







