పాత్రికేయులపై దాడి చేసిన బిజెపి కార్యకర్తలను అరెస్టు చేయాలి

UPDATED 20th SEPTEMBER 2018 THURSDAY 7:00 PM

పెద్దాపురం: కాకినాడ పాత్రికేయులపై దాడికి పాల్పడిన బిజెపి కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పెద్దాపురం ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం పలువురు పాత్రికేయులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు అడపా వెంకట్రావు, రెడ్డిపల్లి రమణమూర్తిలు మాట్లాడుతూ పార్టీ సమావేశానికి పిలిచి మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించిన బిజెపి కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు స్వాతి ప్రసాద్ నిలువరించినా బిజెపి కార్యకర్తలు మీడియాపై దాడి చేయడం అమానుషమని అన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్  చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో నాంచారయ్యకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉప్పలపాటి చంద్రదాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెమ్మాడి వీరభద్రవర్మ, మాసా చందు, నియోజకవర్గ కార్యదర్శి దేవరకొండ సుధాకర్, చవ్వాకుల ఈశ్వరరావు, పచ్చాకుల లోవరాజు, ఇర్షాద్ ఆలీ,  తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us