UPDATED 29th APRIL 2018 SUNDAY 7:00 PM
పెద్దాపురం: ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా కలిగి ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎడిబి) బ్రాంచ్ మేనేజర్ జి. గోపాలకృష్ణన్ అన్నారు. మండల పరిధిలోని వాలుతిమ్మాపురం గ్రామంలో గ్రామస్వరాజ్ అభియాన్ లో భాగంగా ఆదివారం ఇంటింటికీ సర్వే నిర్వహించారు. అటల్ పెన్షన్ యోజన, పిఎంజెజెవై తదితర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ కరెస్పాండెంట్ మన్యం చిన్న, గ్రామ సర్పంచ్ బచ్చల మరియమ్మ, బచ్చల రాజు, సాల్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.







