జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో ఆదిత్య విద్యార్థుల సత్తా

UPDATED 15th DECEMBER 2018 SATURDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాజమహేంద్రవరం గైట్ కళాశాలలో నిర్వహించిన స్పోర్ట్స్&గేమ్స్ మీట్ -2018లో వివిధ విభాగాలలో సత్తా చాటి బహుమతులు గెలుచుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్ తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు గైట్ కళాశాలలో నిర్వహించిన 23వ జిల్లాస్థాయి అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్&గేమ్స్ మీట్-2018లో ఆదిత్య విద్యార్థుల విశేష ప్రతిభ కనబరిచారని తెలిపారు. కబాడీ విన్నర్స్ గా ఆదిత్య విద్యార్థులు, రన్నర్స్ గా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్&టెక్నాలజీ, వాలీ బాల్ విన్నెర్స్ గా ఆదిత్య కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, టేబుల్ టెన్నిస్ (డబుల్స్) రన్నర్స్ గా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ &టెక్నాలజీ, టేబుల్ టెన్నిస్ సింగిల్స్&డబుల్స్ విన్నర్స్ గా ఆదిత్య కళాశాలకు చెందిన విద్యార్థులే గెలుపొందారని తెలిపారు. 100 మీటర్లు రన్నింగ్ లో ప్రథమస్థానం, 200,1500 మీటర్లులో ద్వితీయస్థానం, డిస్కస్ త్రో ద్వితీయ, జావెలియన్ త్రో తృతీయ, హైజంప్ ద్వితీయ స్థానాల్లో  గెలుపొంది సత్తా చాటారని కుమార్ తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 17వ తేదీ  గుడ్లవల్లేరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని అయన వివరించారు. విజేతలను ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మాధవరావు, తదితరులు అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us