గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి కోరారు. మండలంలోని కొత్తాడ సూరంపాలెం పంచాయతీలో ఉపాధి హామీ పనుల గుర్తింపు గ్రామసభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులు గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా ఉండే పనులను గుర్తుంచుకోవాలన్నారు. ఎంపీడీవో జాన్ మిల్టన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ఇవ్వడం జరిగిందని, ఎవరికైనా కొత్త కార్డులు కావాల్సి వస్తే ఉపాధి హామీ సిబ్బంది ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో సురేష్ కుమార్, సర్పంచులు కామరాజు, దొర,శివ,
ఉపాధి హామీ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







