UPDATED 25th NOVEMBER 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఐదు అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇప్పించాలని రెండు అర్జీలు, ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసి పనులు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఒకటి, గ్రామ వాలంటీర్ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని తగు చర్యలు తీసుకోవాలని ఒకటి, భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయుట గురించి ఒకటి, సొంత కిళ్ళీ షాపు తొలగించి అక్రమంగా దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







