UPDATED 16th OCTOBER 2018 TUESDAY 5:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రాజమహేంద్రవరంలో యుపి టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి టెక్నికల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. యుపి టెక్నాలజీస్ నిర్వహించిన ఈ జిల్లాస్థాయి పోటీలలో 44 టీములు పాల్గొన్నాయని, తమ సంస్థ విద్యార్థులు ప్రతిభ కనబరచి ద్వితీయ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని డాక్టర్ రమేష్ అన్నారు. ఈ సందర్భంగా విజేతలు బి. రాజశేఖర్, జి.ఎన్. వెంకటస్వామి, ఎస్. తరుణ్ కుమార్ లను ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, విభాగాధిపతులు, తదితరులు అభినందించారు.







