UPDATED 18th SEPTEMBER 2019 WEDNESDAY 7:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన హ్యూమానిటీస్ &బేసిక్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వీరవిల్లి సూర్యనారాయణకు కీ నోట్ స్పీకర్ & ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ గా ఎంపిక చేస్తూ స్విట్జర్లాండ్ లో జరగనున్న 23వ యూరో బయోటెక్నాలజీ కాంగ్రెస్ నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డాక్టర్ వీరవిల్లి టీచింగ్, రీసర్చ్ బయోగ్రఫీని ప్రశంసిస్తూ ఆయన అనుభవాలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించిందని అన్నారు. అక్టోబర్ నెల 21,22తేదీలలో స్విట్జర్లాండ్ లో జరిగే సమావేశంలో ఘన వ్యర్ధాల నుంచి శక్తిని పర్యావరణహితంగా ఉత్పత్తి చేయడంపై చేసిన ప్రత్యేక పరిశోధనా పత్రం సమర్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, హెడ్ ఆర్&డి డాక్టర్ కెవిఎస్.రామచంద్రమూర్తి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, తదితరులు డాక్టర్ సూర్యనారాయణను అభినందించారు.







