UPDATED 20th DECEMBER 2018 THURSDAY 5:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జెఎన్టీయుకె, నన్నయ విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుబంధంగా పనిచేస్తున్న కళాశాలల్లో పురుషుల, మహిళల జట్లకు గైట్ కళాశాల ప్రాంగణంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల వ్యాయమ అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ మంజ్రేకర్ హెన్రీ తెలిపారు. ఈ పోటీలకు 31 పురుషుల, 12 మహిళల జట్లు హాజరయ్యాయని, రెండురోజుల పాటు జరిగే కబడ్డీ పోటీలలో గెలుపొందిన విన్నర్స్, రన్నర్స్ జట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జ్ఞానభేరి కార్యక్రమంలో బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎస్ఎన్ మూర్తి, ఈ క్రీడా పోటీలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ అధ్యాపకులు డాక్టర్ సిఎం హెన్రీ, పి. శివకుమార్, డి. సూర్యనారాయణ, కోచ్ అప్పారావు దొర, తదితరులు పాల్గొన్నారు.







