ప్రజావాణికి అర్జీలు వెల్లువ

UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఈవోపీఆర్డీ జగ్గారావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సుమారు 25 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ శివకుమార్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సర్వే నిమిత్తం 13 మంది దరఖాస్తులు, ఉపాధి హామీ రెండు,  పింఛన్ల కోసం నాలుగు, ఎన్టీఆర్ గృహాల కోసం మూడు, కొత్త రేషన్ కార్డుల కోసం మూడు, తదితర అర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో నాగేశ్వరరావు, ఎంఎవో శ్యామూల్ జాన్, వెలుగు ఎపిఎం జగదీశ్వరి, ఎంఈవో వెంకటరమణమ్మ, విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us