గైట్ లో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం

UPDATED 11th JULY 2019 THURSDAY 8:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా investing in  youth is investing in the  future అనే అంశంపై డిఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు మానవ హక్కులు, స్త్రీ, పురుష  సమానత్వం, అధిక జనాభా వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. మనదేశ జనాభాలో యువత అధికంగా ఉన్నారని, అందుకే ప్రపంచ జనాభా భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. అధిక జనాభాను అదుపుచేసేందుకు కుటుంబ నియంత్రణను తప్పక పాటించాలని సూచించారు. కళాశాల హెచ్.బి.ఎస్ డీన్ డాక్టర్ వి. కృష్ణకుమారి మాట్లాడుతూ దేశంలో అధికంగా ఉన్న యువ జనాభాకు సరైన మార్గనిర్దేశనం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వైడి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.            

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us