ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనా సదస్సు

UPDATED 31st MAY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: ట్రాఫిక్ నిబంధనలపై స్థానిక రైల్వే కల్యాణ మండపంలో ఆటో ఓనర్లు, డ్రైవర్లుకు అవగాహన సదస్సు నిర్వహించారు. సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దాపురం సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకపోవడం వంటి డ్రైవర్లు చేసే చిన్న పొరపాటు కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వాహనాలు నడిపే సమయంలో సెల్ ఫొన్ మాట్లాడడం, రాత్రి సమయంలో నిద్ర లేకుండా వాహనాలు నడపడం వలన అనేక  ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే ఆటోలు రోడ్డుకు మధ్యలో నిలుపుదల చేయుట వలన ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని, ఆటోలను ఒక పక్కకు ఆపి ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us