UPDATED 13th DECEMBER 2018 THURSDAY 6:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్, కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 71 మంది విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై.డి. శివప్రసాద్, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మాధవి, తదితరులు పాల్గొన్నారు.







