UPDATED 2nd OCTOBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామానికి చెందిన మోదమాను నాగ రుద్రా వినాయక స్వామి, కాల్వల అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి యువనేస్తం పధకానికి ఎంపికైనట్లు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి తెలిపారు. ఈ మేరకు యువనేస్తం ధ్రువీకరణ పత్రాలను మంగళవారం వారికి అందచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆయన అభినందించారు.







