UPDATED 15th NOVEMBER 2017 WEDNESDAY 4:00 PM
పెద్దాపురం: శాసనమండలిలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ ముస్లింలు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు ఎం.ఎల్. ఆలీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా ఎన్.ఎం.డి. ఫరూక్, చీఫ్ విప్ గా ఎం.ఎ. షరీఫ్ లను నియమించడం శుభపరిణామమన్నారు. మైనారిటీలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధవంతమైన నాయకుడని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో మైనారిటీలకు చెందిన మసీదులు, దర్గాలు, షాదీఖానాల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మైనారిటీలు రుణపడి ఉంటారన్నారు. అలాగే ఇమామ్, మౌజెన్ లకు నెలవారీ పారితోషకం ఇవ్వడం వల్ల తోడ్పాటు లభించిందన్నారు. చేనేత వర్గాలవారికి కల్పించే విధంగా మైనారిటీ వర్గాల వారికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే పెద్దాపురం పట్టణంలో మసీదులు, దర్గాలు, షాదీఖానాల అభివృద్ధికి కృషి చేస్తున్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.







