అమిత్ షా కుమారుడి అక్రమ సంపాదనపై న్యాయ విచారణ జరిపించాలి

UPDATED 11th OCTOBER 2017 WEDNESDAY 9:00 PM

విజయవాడ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడి అక్రమ సంపాదనపై వెంటనే న్యాయ విచారణ జరపాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రదీప్‌ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ  ఆధ్వర్యంలో విజయవాడలో అవినీతి దిష్టిబొమ్మను దహనం చేసి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడి జయ్‌షా కంపెనీ వార్షిక ఆదాయం భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాగానే ఉన్నట్లుండి వేల కోట్లకు ఏవిధంగా పెరిగిందో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దుతో ప్రజలందరికీ మంచి చేస్తానని చెప్పిన మోడీ తన బినామీలకు మాత్రమే మంచిచేసారని ఆయన ఎద్దేవా చేసారు. 2016 నాటికి కంపెనీకి నష్టం వచ్చి మూసివేయడం జరిగిందని దీనిలో అంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా ఒక ప్రైవేట్‌ కేసుకు ఒక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను బిజెపి ప్రభుత్వం ఏ విధంగా నియమిస్తుందో సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యుడికి ఎటువంటి రక్షణ లేదని, సామాన్యుడిని నాశనం చేస్తూ ఈరోజు కార్పొరేట్‌ కంపెనీలకు బిజెపి ప్రభుత్వం కొమ్ము కాస్తోందన్నారు. ది వైర్‌ అనే పత్రిక అవినీతిని బయటపెట్టిందని ఆ పత్రికపై రూ 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని బెదిరిస్తున్నారని, అవినీతి చేయడమే కాక ఆ పత్రికపై ఏవిధంగా దావా వేస్తారని ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలు అన్నిగమనిస్తున్నారని 2019లో ప్రజలు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని ప్రజామోదంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఖచ్చితంగా బిజెపి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనమన్నారు. తక్షణం బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి అమితాషా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ నాయకులు తాయి సుధీర్, పి కిరణ్‌, రాజశేఖర్‌, ఏపిసిసి ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, వి గురునాధం తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us