AP News: చింతామణి నాటకం ఇక చూడలేరు..ఎందుకంటే?

అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం అంటే తెలియని వారు ఉండరు. పల్లెల్లో అంతగా ప్రాచుర్యం పొందింది ఈ డ్రామా. అయితే, చింతామణి నాటకంపై నిషేధం విధించాలని అర్యవైశ్యులు కోరారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనిపై తక్షణం చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నాటకంలోని సన్నివేశాలు తమను కించపరిచే ఉన్నాయని, నాటక ప్రదర్శనను నిషేధించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us