UPDATED 24th JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: ఇంటర్ మీడియట్ విద్యాశాఖ స్వర్ణోవాత్సవాల్లో భాగంగా ఇటీవల తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి ఉద్యోగుల క్రీడా, సాంస్కృతిక పోటీలలో సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల లైబ్రేరియన్ ఎమ్.శాంతిశ్రీ ఐదు విభాగాలలో పతకాలు సాధించారు. ఈమేరకు గురువారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన విద్యాశాఖ కమీషనర్ బి. ఉదయలక్ష్మి శాంతిశ్రీకి పతకాలు అందచేశారు. మహిళల షటిల్, బాడ్మింటన్ సింగిల్, డబుల్స్ విభాగాలలో ప్రథమ స్థానం, టెన్నికోయిట్, షాట్ ఫుట్ విభాగాలలో ప్రథమ స్థానం, షటిల్ విభాగంలో రెండో స్థానాన్ని శాంతిశ్రీ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా విభాగంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శాంతిశ్రీని విద్యా శాఖ కమీషనర్ బి. ఉదయలక్ష్మి, జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా, ఇంటర్ మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వై. సుబ్బారావు, ఆర్ఐవో టి. వెంకటేశ్వరరావు, డివైవోఇఓ హెబ్సీరాణి, కళాశాల ప్రిన్సిపాల్ ఐ. శారద, తదితరులు శాంతిశ్రీని అభినందించారు. శాంతిశ్రీ సమాచార, పౌర సంబంధాల శాఖ జిల్లా ఉప సంచాలకులు ఎమ్. ఫ్రాన్సిస్ సతీమణి కావడం విశేషం.







