గైట్ లో అక్టోబర్ 17 నుంచి జాతీయ సదస్సు

UPDATED 23rd SEPTEMBER 2019 MONDAY 9:00 PM

రాజానగరం(రెడ్ బీ న్యూస్): గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్)  కళాశాలలో ఇండస్ట్రీ 4.0 అడాప్షన్ అండ్ ఇన్నోవేషన్ అనే అంశంపై వచ్చేనెల 17 నుంచి రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు గైట్ మేనేజ్ మెంట్ స్టడీస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె.రాజు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జాతీయ సదస్సు బ్రోచర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రోడక్టవిటీ, ప్రోసెస్ మేనేజ్ మెంట్, గ్రీన్ టెక్నాలజీ, బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్, న్యూస్ సర్వీసెస్ అండ్ ఇకో సిస్టమ్స్ , ఇంటిగ్రేటెడ్ మేనేజ్ మెంట్, న్యూ రెవిన్యూ మోడల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్, మార్కెట్ ఇంటలిజెన్స్, సస్టైనబిలిటీ, బిగ్ డేటా అనాలసిస్, డెసిషన్ సపోర్ట్ సిస్టం, లీడర్ షిప్ ఇన్ ది మిలీనియం, ఇన్నోవేషన్, న్యూ స్టార్ట్ అప్ తదితర అంశాలపై పరిశోధనా పత్రాలు, ఆర్టికల్స్, టెక్నికల్ పేపర్స్ ను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈ పత్రాలను అక్టోబర్ నెల ఏడవ తేదీలోగా సమర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణరాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.ఎస్.ఎన్.మూర్తి, డిఎంఎస్ ఆటోమొబైల్ విభాగాధిపతులు డాక్టర్ ఎంవి సుబ్బారావు, వి. సుబ్రహ్మణ్యం, మేనేజ్ మెంట్ విభాగం అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.                      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us