UPDATED 9th JUNE 2018 SATURDAY 6:30 PM
మండపేట: ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ద్వారపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యమిత్ర వి. కళ్యాణి కోరారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి. వరప్రసాద్ ఆదేశాల మేరకు డిటిఎల్ బి. నరేష్ పర్యవేక్షణలో స్థానిక బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న శ్రీ రామా హిందూ మున్సిపల్ పాఠశాలలో విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకంపై శనివారం ఆమె అవగాహన కల్పించారు. ఈ పథకంలో సభ్యత్వం పొందడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఖర్చులేకుండా కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చని సూచించారు. సుమారు 1885 వ్యాధులకు వైద్యం చేయడం జరుగుతుందని చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.







