UPDATED 5th DECEMBER 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి కార్తీకమాసంలో రూ.33,31,585 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్య నిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. ఆలయంలోని దీపారాధ, అన్నదాన ట్రస్టు, హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో గురువారం లెక్కించారు. పూజా రుసుం ద్వారా రూ.16,26,290, లక్షపత్రి పూజలు ద్వారా రూ.55 వేలు, షాపులు అద్దె ద్వారా రూ.41 వేలు, హుండీల ద్వారా రూ.16,09585 ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది హుండీలు, పూజా రుసుం, లక్షపత్రి పూజలు, దుకాణాల అద్దెల ద్వారా రూ. 32,15,654 ఆదాయం సమకూరిందని, ఈ సంవత్సరం అదనంగా రూ.1,15,931 ఆదాయం ఆలయానికి వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో కాకినాడ అన్నదాన సత్రం ఈవో వంగా లేపాక్షి నర్సింహారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ మట్టపల్లి రమేష్, భక్త సంఘం సభ్యులు గంజి బూరయ్య, బిక్కిన పరమేశ్వర సాయి, తదితరులు పాల్గొన్నారు.







