భారీ లోడ్ వాహనాల రాకపోకలతో ఇబ్బందులు

సామర్లకోట: 10 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): స్థానిక ఎఫ్.సి.ఐ గోడౌన్ రోడ్డులో వస్తున్న లారీలను పట్టణంలోని సత్యనారాయణపురం ప్రధాన రహదారి వెంబడి కిలోమీటర్ల మేర రోడ్డుకు పక్కాగా నిలిపివేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక సచివాలయ అధికారులకు సత్యనారాయణపురం ప్రజలు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ సత్యనారాయణపురం ప్రధాన రహదారి వెంబడి పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలు, వ్యాన్ స్టాండ్ తో పాటు ఎన్నో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని, వాటికి మించి వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని వివరించారు. రోజుల తరబడి లారీలు దూర ప్రాంతాల నుంచి వచ్చి తమ నివాసాల ఎదురుగా నిలిపి వేసి ఉండడంతో తాము తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు ప్రస్తుత కరోనా వైరస్ భయంతో ఎక్కడి నుంచో లారీ డ్రైవర్లు వచ్చి రోజుల తరబడి ఇక్కడే ఉండటంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. అంతేకాకుండా పాఠశాలలు తెరవకపోవడంతో పిల్లలు ఇళ్ల వద్ద ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం స్పందించి భారీ వాహనాలు జనవాసలకు దూరంగా ఏడిబి రోడ్డు వెంబడి నిలుపుదలచేసుకునే విధంగా, సీరియల్ ప్రకారం నేరుగా గోదాముల వద్దకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో సత్యనారాయణపురానికి చెందిన పలువురు ప్రజలు పాల్గొన్నారు
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us