UPDATED 8th NOVEMBER 2018 THURSDAY 6:00 PM
సామర్లకోట: కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో వేంచేసియున్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయంలో నిర్వహించిన కార్తీకమాస నృత్యోత్సవం - 2018లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ కు నిర్వాహకులు నాట్య చూడామణి పురస్కారం అందచేసి ఘనంగా సత్కరించారు. కార్తీకమాస నృత్యోత్సవంలో ఆయన చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంప్రదాయం ఆర్గనైజేషన్, శ్రీశ్రీ మహాయోగినీ మాతా మాణిక్యేశ్వరీ ట్రస్టు నిర్వాహకులు ఎం. నవీన్ కుమార్, ముఖ్య అతిధులుగా హాజరైన శాసన పరిశోధకులు డాక్టర్ కావూరి శ్రీనివాస్, దేవస్థానం ఈవో రామచంద్రరావు, భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు లలితారావు, భరతనాట్య గురువు పి. శ్రీనివాసరావు, తదితరులు నృత్యకారుడు ప్రసాద్ కు నాట్య చూడామణి ఆవార్డును అందచేసి పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నృత్యకారుడు ప్రసాద్ మాట్లాడుతూ గతంలో తాను మహాశివరాత్రి ఉత్సవాల్లో శ్రీశైలంలో నిర్వహించిన జాతీయస్థాయి నృత్యోత్సవాల్లో పాల్గొని శ్రీశైల నాట్యప్రభ అవార్డును అందుకున్నానని, ప్రస్తుతం నాట్య చూడామణి ఆవార్డును పొందడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రసాద్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హెూంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ (చిన్ని), శ్రీ కంచి కామకోటి మహాసంస్థానం చైర్మన్ చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, ప్రముఖ సీనియర్ కళాకారులు అంబటి అప్పారావు, పారిశ్రామికవేత్తలు సింగవరపు సాయిబాబు, తులసీధరరావు సోదరులు, క్లస్టర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), రోటరీ క్లబ్ నాయకుడు అంబటి సుబ్రహ్మణ్యం, శ్రీ వీరభద్రా జ్యోతిషాలయం నిర్వాహకులు చీమలకొండ వీరభద్రప్రసాద్ (ఆస్ట్రో ప్రసాద్), తదితరులు అభినందించారు.







