UPDATED 17th MARCH 2018 SATURDAY 10:00 PM
సామర్లకోట; స్థానిక స్టేషన్ సెంటర్లో వేంచేసివున్న నూకాలమ్మ అమ్మవారి తొలి అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని బాణాసంచాతో, వివిధ రకాల వేషధారణలతో సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. సామర్లకోట మినీ గూడ్స్ వ్యాన్ ఆటో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.







