* బాలికల జట్టుకు ద్వితీయస్థానం
* బాలుర జట్టుకు నాల్గవ స్థానం
UPDATED 26th FEBRUARY 2020 WEDNESDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల సూపర్-7 క్రికెట్ టోర్నమెంట్-2020 పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఈనెల 23, 24 తేదీల్లో కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో తమ కళాశాలకు చెందిన బాలికల జట్టు రన్నర్ అప్ గా నిలిచి ద్వితీయస్థానం, బాలుర జట్టు నాల్గవ స్థానం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలిక జట్టు కెప్టెన్ శైలజ, దీపిక, వినీత, అక్షయ, ప్రవల్లిక, శ్రీసత్య, నిహిత, సుభాషిణి, లావణ్య, సీత, దివ్య, బాలుర జట్టు కెప్టెన్ అనిల్ కుమార్, రాంబాబు, సుధీర్, ప్రేమ్, కిషోర్ లను కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు, ఏవో కె.ఆర్. సందీప్, ఈవో ఎన్. జెన్నిబాబు, ప్రిన్సిపాల్ ప్రతాప్ కుమార్, బి ఫార్మసీ ప్రిన్సిపాల్ సోమశేఖర్, ఏసీవో పెదకాపు, పిడి స్వామి, రామకృష్ణ, శ్రీధర్ రెడ్డి, తదితరులు అభినందించారు.







