ఖోఖో క్రీడాకారిణికి అభినందనలు

UPDATED 11th OCTOBER 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): జార్ఖండ్ రాష్ట్రం ధన్ భాద్ లో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు జరిగిన 33వ సబ్ జూనియర్స్ జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరఫున మన జిల్లా నుంచి స్థానిక అయోధ్య రామాపురంలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి. మహాలక్ష్మి పాల్గొన్నట్లు పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నక్కా జానకిరామయ్య, పీడీ తాళ్లూరి వైకుంఠం, ఉపాధ్యాయులు, విద్యార్థినిని అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us