డాక్టర్ చిన్నయ్యదొరను కలిసిన రిటైర్డ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్

UPDATED 11th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొరను రిటైర్డ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జె.డి. లక్ష్మీనారాయణ సోమవారం కలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురంలోని ఉమర్ ఆలీషా గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ ను సందర్శించిన అనంతరం ఆయన డాక్టర్ చిన్నయ్యదొరను కలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా డాక్టర్ చిన్నయ్యదొరను మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నయ్యదొర ఆయనను దుశ్శాలువతో ఘనంగా సన్మానించి భరతమాత చిత్రపటాన్ని బహూకరించారు. డాక్టర్ చిన్నయ్యదొరను కలిసిన వారిలో గట్టిం మాణిక్యాలరావు, తదితరులు ఉన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us