UPDATED 8th AUGUST 2017 TUESDAY 6:00 PM
గండేపల్లి : ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర లేక పడుతున్నబాధలపై సినిమా షూటింగ్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలోమల్లిరెడ్డి కృష్ణార్జునరావు బొప్పాయితోటలో నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న‘అన్నదాత సుఖీభవ’ చిత్రం షూటింగ్ నిర్వహించారు. చిత్ర దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల కష్టాలపై ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ఈనెల 5 తేదీన ప్రారంభించిన ఈ చిత్రం 60 రోజులలో షూటింగ్ పూర్తవుతుందన్నారు.







