UPDATED 25th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక అనపర్తి రైల్వే స్టేషన్ మూడవ నెంబరు ఫ్లాట్ ఫారంపై గుర్తుతెలియని మృతదేహాన్ని కనుగొన్నారు. సామర్లకోట రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జె. గోవిందరావు తెలిపిన వివరాలు ప్రకారం మృతుని వయస్సు సుమారు 75 సంవత్సరాలు ఉండొచ్చని, శరీరంపై ఎటువంటి గాయాలు లేవని కుడిచేతిపై మిస్సమ్మ అను పచ్చబొట్టు తప్ప మరే ఇతర వివరములు లేవని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.







