ఎయిడ్స్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలి

* ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి

UPDATED 1st DECEMBER 2020 TUESDAY 9:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): ఎయిడ్స్‌ రహిత సమాజ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపై మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సమాజ బాగస్వామ్యమే ఎయిడ్స్ వ్యాధికి పరిష్కారం అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సర నినాదంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎయిడ్స్‌ వంటి వ్యాధులపై యువతకు అవగాహన ఉండాలన్నారు. ఈ వ్యాధికి మందులు లేకపోయినా నివారణ ఒక్కటే మార్గమని, హెచ్ఐవీ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ఎయిడ్స్  లోగో ఆకారంలో నిలబడి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఈకార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఎ. రమే‌ష్, గ్రంధాలయ విభాగాధిపతి కె. అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us