Sunak & Modi: ఒక్క ట్వీట్‭తో భారత్, బ్రిటన్ మధ్య స్నేహాన్ని వెల్లడించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

UPDATED 16th NOVEMBER 2022 WEDNESDAY 9:10 PM

Sunak & Modi: బ్రిటన్, ఇండియా దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగతా అన్ని దేశాలతో పోల్చుకుంటే బ్రిటన్‭తో భారత్‭కు అత్యంత సన్నిహిత, లోతైన సంబంధాలు ఉంటాయి. అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. ఇక ఇరు దేశాల మధ్య దోస్తీ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఎంత ప్రత్యేకంగా ఉంటుందో స్వయంగా బ్రిటన్ ప్రధానమంత్రే రిషి సునాంకే రుజువు చేశారు.

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని జీ-20 సమ్మిట్‭లో తాను కలిసిన ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘ఒక బలమైన స్నేహం’ అని హిందీలో ట్వీట్ చేశారు.

మోదీతో కరచాలనం చేస్తున్న ఫొటోను రిషి సునాక్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అనంతరం ‘స్నేహంతో ఒక్కటయ్యాం’ అని ఇంగ్లీషులో ‘ఒక బలమైన స్నేహం’ అని హిందీలో ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‭లో ఇరు దేశాల జాతీయ జెండాలను మెన్షన్ చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీని సైతం మెన్షన్ చేశారు. కాగా, ఈ ట్వీట్‭పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మోదీకి పెరిగిన ఖ్యాతిని పొగుడుతూనే, ఇండియాతో సంబంధాలపై రిషి సునాక్ వైఖరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us