మరిడమ్మ జాతర ఉత్సవ కమిటీ ప్రమాణస్వీకారం

UPDATED 7th JULY 2019 SUNDAY 9:00 PM

పెద్దాపురం: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఆలయంలో జరిగింది. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తోట వాణి హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులుగా నేలా ప్రసాద్, దాకమూరి రమేష్, దారపురెడ్డి సత్యనారాయణ, దేవాడ శ్రీనివాసరెడ్డి, దుర్గా శ్రీనివాస్, పొతాబత్తుల చంటిబాబు, ముమ్మన ప్రకాష్, వాసా భానుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గోలి రామారావు, వైసిపి నాయకులు నెక్కంటి సాయిప్రసాద్, తాడి రాజశేఖర్, కర్రి వెంకట రమణ, కంటే వీర్రాఘవరావు, కందుల వెంకటచలం, పేర్నిడి ఈశ్వరరావు, వాసంశెట్టి గంగ, పేరిశెట్టి మృత్యుంజయరావు, తదితరులు పాల్గొన్నారు.              

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us