UPDATED 14th AUGUST 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించేందుకు మిషన్ ఏతికల్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నీతి కథల పోటీలు బుధవారం నిర్వహించినట్లు బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 72 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వీరిలో మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు వి. రాజు ప్రకటించిన వెయ్యి రూపాయలు నగదు పారితోషికం కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇవ్వనున్నట్లు హెచ్ఎం తెలిపారు. ఈ పోటీలకు కన్వీనరుగా కెవివి సత్యనారాయణ, న్యాయనిర్ణేతలుగా బి. శ్రీలక్ష్మి, బేబీరాణి వ్యవహరించారు. అలాగే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తాళ్లూరి వైకుంఠం ఆధ్వర్యంలో విద్యార్థులకు కబడ్డీ, మ్యూజికల్ చైర్స్, ఖోఖో, పరుగు పందెం, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గోవిందు, కె. అరుణ, ఏ.ఎల్.వి. కుమారి, ఏపీ రాజేంద్రకుమార్, షఫీ, తదితరులు పాల్గొన్నారు.







