సిప్ నిధులు వస్తాయా లేదా...

* కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు సభ్యులు డిమాండ్ 
* అధికారులపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం

UPDATED 25th JANUARY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: మున్సిపాలిటీకి సిప్ నిధులు వస్తాయని, వాటితో పలు అభివృద్ధి పనులు చేపట్టవచ్చని గత రెండు సమావేశాల నుంచి అధికారులు చెబుతున్నారని త్వరలో ఎలక్షన్ కోడ్ రానున్న సందర్భంగా ఈ నిధులు వస్తాయా లేదా అని ప్రతిపక్ష సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు. సామర్లకోట పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం ఉదయం పురపాలక సంఘ కౌన్సిల్ హాలులో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముందుగా జీరో అవర్ లో ప్రతిపక్ష సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజెస్ మున్సిపల్ సిప్ నిధులపై వివరణ ఇవ్వాలని అధికారులను  డిమాండ్ చేశారు.  దీనిపై మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు మాట్లాడుతూ  జిల్లావ్యాప్తంగా ఒకే టెండర్ పిలుస్తున్నారని, టెండర్ అయిన తర్వాత గవర్నమెంట్ కమిటీలో ఆమోదం పొందాలని దీనిపై పూర్తి వివరాలు తదుపరి సమావేశంలో తెలియజేస్తామని అన్నారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రతిపక్ష, అధికార కౌన్సిలర్లు ఏ విధమైన చర్చ చేపట్టకుండా ఆమోదం తెలిపారు. ఈ అత్యవసర సమావేశం ఎజెండాలో 12 అంశాలు ఉండగా అన్ని అంశాలను అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు కలిసి ఆమోదం తెలిపారు.  ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us