UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట-పెద్దాపురం ఆటో యూనియన్ వినాయకచవితి పురస్కరించుకుని స్థానిక బసివిరెడ్డి సత్రం వద్ద ఏర్పాటు చేసిన గణేశుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దవులూరి దొరబాబు శనివారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వినాయక ఉత్సవాలు చిన్నవీధి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శనివారం వినాయకుని నిమజ్జనం, భారీ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పరమానందగిరి స్వామి, అర్చకులు పెండ్యాల సుబ్రహ్మణ్యం, మణికంఠ రజక సంఘం సభ్యులు గొల్తి సత్యనారాయణ, మణికంఠ, ఇరుసుమళ్ల సత్యనారాయణ, కట్టమూరు వీరసత్తిబాబు, పొట్నూరి శ్రీను, పొట్నూరి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.







