UPDATED 12th JULY 2019 FRIDAY 8:00 PM
పెద్దాపురం: పెద్దాపురం తహసీల్దారుగా కోనాడ పద్మావతి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చిన ఆమె గతంలో రాజవొమ్మంగి, ఆలమూరు ప్రాంతాల్లో తహసీల్దారుగా పనిచేశారు. ఇంతవరకు ఇక్కడ తహసీల్దారుగా విధులు నిర్వర్తించిన కలగర గోపాలకృష్ణ కృష్ణా జిల్లా బంటుమిల్లికి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడుని ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని విఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది, తదితరులు ఆమెను కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు.







