రైల్వేను ప్రైవేటీకరించడం దేశద్రోహమే

UPDATED 29th JULY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: రైల్వేను ప్రైవేటుకు అప్పగించడం దేశద్రోహం చేయడమేనని సిఐటియూ నాయకులు అన్నారు. భారత రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణను నిరసిస్తూ మండల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మఠం సెంటర్ మీదుగా సోమవారం భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సామర్లకోట రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియూ నాయకులు కరణం ప్రసాద్ మాట్లాడుతూ రైల్వేను ప్రైవేటుకు అప్పగించడం వల్ల ప్రయాణికులపై అధిక భారం పడుతుందని, అలాగే రైల్వే భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రభుత్వ సంపదను ప్రైవేటుకు అప్పగించే కుట్రను ప్రజలంతా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలోని అత్యంత సురక్షితమైన, తక్కువ ధరకే ప్రయాణించే భారతీయ రైల్వేను ప్రైవేటీకరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటుకు అప్పగిస్తుందని, ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోపాల్, నాగమణి, కె. సత్యన్నారాయణ, గోవిందు, శ్రీనివాసు, బాలాజీ, వరలక్ష్మి, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us