రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

UPDATED 28th MAY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలోని చంద్రంపాలెం రైల్వే గేట్ వద్ద డౌన్ లైన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైలు నుంచి జారిపడడం వల్ల బలమైన గాయం తగిలి చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని, ఎత్తు 5.5 అంగుళాలు, బిస్కెట్ కలర్ ఫుల్ హాండ్స్ చొక్కా ధరించి ఉన్నాడని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి. లలిత తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us