తపాలాశాఖ సేవలపై అవగాహనా ర్యాలీ

UPDATED 13th NOVEMBER 2019 WEDNESDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): తపాలాశాఖ ద్వారా ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని ఎఎస్పీ(పోస్టల్) సిహెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. తపాలా శాఖ అందిస్తున్న సేవలు, పథకాలపై స్థానిక తపాలా శాఖ అధికారులు, సిబ్బంది బుధవారం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ శ్రీనివాస్, హెడ్ పోస్ట్ మాస్టర్ డి.కె. శేషాచార్యులు ప్రారంభించిన ఈ ర్యాలీ విఘ్నేశ్వర థియేటర్, అయోధ్య రామపురం, సత్తెమ్మ ఆలయం మీదుగా పట్టణ వీధుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖ అధికారులు మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా సుకన్య, ఆర్.డి, ఎస్.బి, లైఫ్ ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి తదితర పథకాల ద్వారా మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సిహెచ్ శ్రీనివాసరావు, స్వామి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us