Russia-Ukraine..‘Operation Ganga’ : ‘ఆపరేషన్ గంగ’.. రంగంలోకి బాహుబలి విమానం C17

UPDATED 1st MARCH 2022 TUESDAY 03:30 PM

Russia-Ukraine..Indian students ‘Operation Ganga’ indian air force : రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆరవరోజు కూడా తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ క్రమంలు యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకురావటానికి కేంద్రం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్ర తరం రావటంతో యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే చర్యలను భారత ప్రభుత్వం మరింత ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే చురుగ్గా జరుగుతున్న తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం భారత వాయు సేన కూడా ముందుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

ఆపరేషన్ గంగ’ పేరుతో యుక్రెయిన్‌ నుంచి భారతీయులను విమానాల ద్వారా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ గంగ కోసం భారత వాయు సేన కూడా పాలుపంచుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. వాయు సేన రంగంలోకి దిగితే తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకురావడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది.‘ఆపరేషన్ గంగ’ కోసం మంగళవారం నుంచే సీ-17 విమానాలను వాయు సేన నడిపే అవకాశం ఉందని తెలిపింది. కాగా..యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు స్పైస్‌జెట్ ఓ ప్రత్యేక విమానాన్ని స్లొవేకియాకు మంగళవారం నడుపుతుంది. ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్లొవేకియాకు వెళ్తారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us