UPDATED 15th AUGUST 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు అమోఘమని మున్సిపల్ చైర్మన్ మన్యం పద్మావతి అన్నారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవరాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మన్యం పద్మావతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, పరాయి పాలనలో మగ్గిన భారత జాతికి విముక్తి కల్పించిన మహాత్ములు చూపిన అడుగుజాడల్లో అందరూ పయనించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు బిస్కెట్లు, పెన్నులు పంచారు.







