రాష్ట్రస్థాయి సిఎం కప్ పోటీలకు సామర్లకోట విద్యార్థులు ఎంపిక

UPDATED 9th OCTOBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: అండర్-17 ఖోఖో విభాగంలో రాష్ట్రస్థాయి సిఎం కప్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు బి. శాంతి, డి.  దుర్గాప్రసాద్ ఎంపికైనట్లు స్థానిక అయోధ్యరామపురంలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడు తాళ్లూరి వైకుంఠం తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా స్టేడియంలో జరిగిన పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ఈనెల 22,23 24 తేదీల్లో అనకాపల్లిలో జరగనున్న పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, మున్సిపల్  కమీషనర్‌ సిహెచ్. వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం, తదితరులు అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us