ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆర్డీవో కు ఫిర్యాదు

UPDATED 31st JULY 2017 MONDAY 5:00 PM

పెద్దాపురం: రంగంపేట మండలం మర్రిపూడి లో బయో మెడికల్ వ్యర్ధాలను శుద్ధి చేసే గోదావరి బయో మేనేజ్మెంట్ పరిశ్రమను నిర్మించవద్దంటూ పెద్దాపురం చినబ్రహ్మదేవం గ్రామానికి చెందిన కంచుమర్తి కాటంరాజు పెద్దాపురం ఆర్డీవో వి. వివిశ్వేశ్వరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిశ్రమను ఇక్కడ నిర్మించడం వల్ల పరిసరాలు కాలుష్యం అవడమే కాకుండా ఫ్యాక్టరీకి సమీపంలో ఉండే చెరువులు విషతుల్యం అయ్యే ప్రమాదం ఉందని ఆర్డీవోకు వివరించారు. అలాగే పరిసర గ్రామాలైన ఆనూరు, కొండపల్లి, వాలుతిమ్మాపురం, ఆర్ బి పట్నం గ్రామాల్లో చెరువులు, పంట పొలాలు పాడైపోతాయని తక్షణమే ఫ్యాకట్రీ నిర్మాణం పనులను నిలిపివేయాలని ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుత్తుల ధనబాబు తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us