ఆదిత్యలో ఉత్సాహంగా 93.5 ఎఫ్ఎం రేడియో కాలేజ్ స్టార్

UPDATED 4th JANAURY 2019 FRIDAY 6:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో 93.5 ఎఫ్ఎం రేడియో కాలేజ్ స్టార్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కోకాకోలా కంపెనీ స్పాన్సరుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల మేనేజ్ మెంట్ ఆటలు, పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాలికల విభాగంలో పి. రాగప్రియ, బాలుర విభాగంలో ఏ. మోహన్ గెలుపొందారు. ఈ సందర్భంగా విజేతలను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అభినందించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో సమానంగా అన్ని రంగాల్లో రాణించినపుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మెహర్జీ దువ్వూరి, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us