ప్రోకబడ్డీ ఎంపైర్ గా మురళీకుమార్ ఎంపిక

UPDATED 24th JULY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణానికి చెందిన భోగిళ్ళ మురళీకుమార్ ప్రోకబడ్డీ ఎంపైర్ గా ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ట్రెజరర్ తాళ్లూరు వైకుంఠం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురళీకుమార్ జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారని, ఆయన ప్రోకబడ్డీ ఎంపైర్ గా ఐదవసారి ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, నోయిడా, జైపూర్, కలకత్తాల లో జరిగే పోటీలలో న్యాయనిర్ణీతగా వ్యవహరిస్తారని తెలిపారు. దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ లీగ్ పోటీలకు  అంపైర్ గా ఎంపికైన మురళీకుమార్ ను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, వీరలంకయ్య, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, శ్రీనివాస్, కబడ్డీ కోచ్ పి. సాయిప్రసాద్, తదితరులు  అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us