స్పందన కార్యక్రమానికి పది అర్జీలు

UPDATED 8th JULY 2019 MONDAY 6:00 PM

పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి పది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో, పెద్దాపురం మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో పెద్దాపురం మున్సిపాలిటీలో సెల్ టవరును తొలగించాలని ఒకటి, పట్టాదారు పాసు పుస్తకం రద్దు చేయమని, భూసర్వే చేయించమని, మైనర్ ఇరిగేషన్ కు సంబంధించిన కాలువపై వంతెన ఏర్పాటు చేయమని, ఎస్సీ కాలనీలో ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మించామని, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు నిలుపుదల చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పింఛన్ కేంద్రాన్ని ప్రజలకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయమని, దర్గా సెంటరులో ధర్మచావిడి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోమని, పింఛన్లు మంజూరు చేయించమని రెండు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us