పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

* ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారావు
* ఆదిత్యలో జగనన్న పచ్చతోరణం

UPDATED 15th MARCH 2021 MONDAY 7:00 PM 

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మొక్కలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, మంచి వాతావరణాన్ని అందించే దిశగా ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా నడుచుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణపై   తమ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ప్రభుత్వ జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి డిజిఓ డాక్టర్ ఆర్. జగదాంబ, ఆరోగ్య సిబ్బంది, తదితరులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ ఏ. రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us