UPDATED 21st MAY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలోని ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా సరఫరా ఫిల్టర్ వాటర్ స్కీంను మున్సిపల్ కమీషనర్ టి. నాగేంద్ర కుమార్, డిఈ సిహెచ్. రామారావు మంగళవారం పరిశీలించారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఫిల్టర్ బెడ్ సామర్థ్యం మూడు మీటర్లు ఉండగా, ప్రస్తుతం రెండు మీటర్లు వాటర్ లెవెల్ ఉందని ఈ వేసవి కాలానికి నీరు సరిపోతుందని కమీషనర్ పేర్కొన్నారు.







